Telangana Assembly Elections-2023: ఓటేసిన సినీ సెలబ్రిటీలు వీరే.. ఫస్ట్‌ ఓటు ఎవరంటే

30 Nov, 2023 08:16 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్‌ మొదలైంది.  రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.  ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తెలంగాణ బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు.

టాలీవుడ్‌ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా హీరో సుమంత్‌ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఓటును వినియోగించుకున్నాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేశాడు.  వాస్తవంగా  ఓటేసేందుకు ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నది బన్నీనే.. ఉదయం 6:30 గంటలకే పోలింగ్‌ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్‌లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్‌ గంటకు పైగానే క్యూ లోన్లోనే నిల్చున్నాడు. 

(ఇదీ చదవండి: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్‌)

జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూ. ఎన్టీఆర్‌ కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్‌తో పాటు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు అమ్మగారు షాలిని ఉన్నారు. వారందరూ కూడా క్యూ లైన్లో నిల్చోని ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. యువత అందరూ నేడు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చాడు. 

►  జూబ్లీహిల్స్ బూత్ నం.149లో ఓట్ వేసిన హీరో రామ్‌చరణ్

►  తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన తెలుగు హీరో ఆది సాయికుమార్

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

  జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేసిన హీరో మహేశ్‌బాబు

►  ఓటేసిన యాంకర్ అనసూయ.. సెల్ఫీ ఫొటో ఇన్ స్టాలో పోస్ట్

►  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన టాలీవుడ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, మెహర్ రమేశ్

►  జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165)లో ఓటేసిన విజయ్‌ దేవరకొండ

►  నానక్ రామ్ గూడలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు నరేష్

►  ఓటుతో మీ గళాన్ని వినిపించండి అంటున్న యంగ్‌ హీరోస్‌ మంచు మనోజ్‌, రామ్‌

►  తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన రవితేజ, గోపీ చంద్‌

►  గచ్చిబౌలి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఓటేసిన హీరో నాని

►  వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ పోలింగ్‌ బూత్‌ 151 వద్ద ఓటేసిన నాగార్జున, అమల, నాగచైతన్య

►  నా హక్కును ఉపయోగించుకున్నాను: సాయి ధరమ్‌ తేజ్‌
►ఓటు వేయడం మన హక్కు, భాద్యత కూడా మరిచిపోకండి: సింగర్‌ సునీత

►  ఓటేసిన బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌, హీరో సుమంత్‌

►  సతీమణి తబితతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్‌ సుకుమార్‌

►  పాన్‌ ఇండియా స్టార్స్‌.. జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

►  ఓటు హక్కు వినియోగించుకున్న విక్టరీ వెంకటేశ్‌,డైరెక్టర్‌ తేజ

► ఓట్‌ వేయని వాడు 'దేశ ద్రోహి': తేజ

►  FNCC వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రాణా దగ్గుబాటి

►  ఓటేసి సామాజిక అభివృద్ధిలో పాల్గొనండి: నటి పూనమ్‌ కౌర్‌

 జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నితిన్‌

► షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో ఓటేసిన రాజమౌళి.. మీరు వేయండి అంటూ ట్వీట్‌

తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌..  ఆసక్తికర ట్వీట్‌

మా కుటుంబంలోని 9 మంది ఓట్లేశారు.. మీరు కూడా ఓటేయాలని కోరిన ఆర్. పి. పట్నాయక్

► జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149) వద్ద భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి

మరిన్ని వార్తలు