Prabhas: తెలంగాణ ఎన్నికల ఓటింగ్.. ఎక్కడా కనిపించని ప్రభాస్

30 Nov, 2023 18:44 IST|Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గురువారం దాదాపు రాష్ట్రమంతటా చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. పూర్తి లెక్కలు తెలియాల్సి ఉంది. మరోవైపు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ కారణమేంటి?

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో 'సలార్'.. డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేయాలనుకున్నారట. కానీ కొన్నాళ్ల క్రితం విదేశాల్లో మోకాలి సర్జరీ చేయించుకున్న ప్రభాస్.. ఈ మధ్యే స్వదేశానికి తిరిగొచ్చాడు.

(ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' మూవీ టికెట్స్ కావాలా? ఇలా చేయాల్సిందే!)

హైదరాబాద్‌లోనే ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే 'సలార్' ట్రైలర్‌ని కూడా సింపుల్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే విశ్రాంతి వల్ల తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రభాస్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడా అని సందేహం వస్తోంది. లెక్క ప్రకారం హైదరాబాద్‌లోని మణికొండ హైస్కూల్‌లో ప్రభాస్.. తన ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఇప్పటివరకైతే ఎక్కడ ఇతడు వచ్చినట్లు సమాచారం లేదు. దీంతో ఈసారి ప్రభాస్.. ఓటు హక్కు వేయలేదని అనిపిస్తుంది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాటు దాదాపు తెలుగు సినీ సెలబ్రిటీలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ)

మరిన్ని వార్తలు