పెళ్లి దుస్తులు తీసుకెళ్తుండగా...

17 Oct, 2019 08:41 IST|Sakshi

సాక్షి, ఆదోని :  పెళ్లి దుస్తులు తీసుకుని తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె అన్న మృతి చెందాడు. తండ్రితో పాటు మరో ఆరుగురు బంధువులు  తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి కుమార్తె స్వల్పగాయాలతో  బయటపడింది. ఈ సంఘటన బుధవారం  బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.  డీఎస్పీ రామకృష్ణ, క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన మద్దికెరలోని మద్దమ్మ బావి వీధిలో నివాసముంటున్న కొట్రేష్, అన్నపూర్ణమ్మ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు.

కుమార్తె సుమలతకు ఎమ్మిగనూరుకు చెందిన వినోద్‌కుమార్‌తో వచ్చే నెల 14,15న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి దుస్తుల కోసం బుధవారం పెళ్లికుమార్తెతో పాటు తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ ఓమ్నీ వ్యానులో ఆదోనికి వచ్చారు. పెళ్లి దుస్తులు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బిణిగేరి-విరుపాపురం మధ్య పొలిమేరమ్మ గుడి సమీపంలో వ్యాను రోడ్డు పక్కన నిలిపారు. అంతలో ఎదురుగా వస్తున్న ఎంహెచ్‌46 ఎఫ్‌4883 నంబరు గల బండల లారీ టైర్‌ పగిలి వ్యాన్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి కొట్రేష్, అన్న సూరిబాబు, బంధువులు  మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణ తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కుమార్తెకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. సూరిబాబు మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొట్రేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. మీనాక్షి, లక్ష్మీదేవి, అనూష, చంద్రకళ, సోమలింగమ్మ, అన్నపూర్ణను మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్‌ చేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆస్పరి పోలీసులు తెలిపారు. ఆదోని డీఎïస్పీ రామకృష్ణ, తాలూకా ఎస్‌ఐ రామంజులు ఆస్పత్రికి చేరుకుని.. ప్రమాదం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ బస్సులో తుపాకీ కలకలం 

‘నా భర్త చావుకు వాళ్లే కారణం’

పెళ్లి రోజు సంబరాలకు భర్త ఒప్పుకోలేదని..

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

ప్లస్‌ ఒన్‌ విద్యార్థినిపై కవలల లైంగిక దాడి

మద్యంతో విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు..

చిదంబరం మళ్లీ అరెస్ట్‌

యశస్వి డబుల్‌ యశస్సు

చింతమనేనిని వదలని కోర్టు కేసులు

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మృతదేహం ‍కళ్లు పీక్కుతిన్న చీమలు!

అందుబాటులో లేని కల్కి భగవాన్‌..

‘నువ్వు దక్కకపోతే.. ఫొటోలు అందరికీ చూపిస్తా’

27 కిలోమీటర్లు 20 ప్రమాదకర మలుపులు

వైఎస్సార్‌సీపీ అభిమాని హత్య.. నిందితుల అరెస్టు

కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

దసరాకు పుట్టింటికి పంపించి.. ప్లాన్‌కు తెర తీశాడు

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం..

లలితా జ్యుయెలరీ దోపిడీ కేసు; అప్‌డేట్‌

ఇండోనేషియా టు హైదరాబాద్‌ వయా దుబాయ్‌

కామాంధులకు కటకటాలు

సెల్‌ ఫోన్లో వేధింపులు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

రుణాలిప్పిస్తామంటూ బురిడీ

కత్తులతో ఒకరిపై ఒకరు దాడి

అమెజాన్‌ డెలివరీ ఏజెంట్‌పై కేసు

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

తీర్థయాత్రలో కన్నీటిసుడి

ఉద్యోగిపై యజమాని దాడి

మహిళ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన మాత్రమే బాకీ..

బాలు పాట హైలైట్‌

గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌

మలుపుల సరోవరం

పల్లెటూరి ప్రేమకథ

రొమాంటిక్‌లో గెస్ట్‌