రైల్వే ప్రయాణికుడి వేషంలో చోరీలు

24 Sep, 2019 10:17 IST|Sakshi
నిందితుడి అరెస్ట్‌ వివరాలను  తెలుపుతున్న రైల్వే సీఐ మహమ్మద్‌ బాబా  

సాక్షి, కడప అర్బన్‌ : కడప రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బంగారు నగలు, సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడున్న నిమ్మకాయల నరేష్‌ అనే నిందితుడిని రైల్వే సీఐ మహమ్మద్‌బాబా ఈనెల 22న అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు పంపారు. సోమవారం సీఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా యల్లనూరు మండలం, చింతకాయమందకు చెందిన నిమ్మకాయల నరేష్, రైళ్లో జనరల్‌ టికెట్‌ను తీసుకుని ప్రయాణికుడి వేషంలో ఎక్కుతాడు. పక్క స్టేషన్‌లలో దిగి ఏసీ బోగీలలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుంటాడు. అదమరిచి నిద్రించేవారికి సంబంధించిన సెల్‌ఫోన్‌లను, బంగారు ఆభరణాలను దొంగిలించి, పరారవుతాడు. అతన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.

15గ్రాముల బంగారు నెక్లెస్, 10 గ్రాముల బంగారుచైన్, రూ. 2000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. కడప రైల్వే పోలీసు స్టేషన్‌లో నమోదైన మూడు కేసుల్లో వీటని రికవరీ చేశారు. అతన్ని విచారించగా మరో15 సెల్‌ఫోన్‌లు దొరికాయి వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.76 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో రైల్వే ఎస్‌ఐ కెఎస్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేంద్ర, జగన్‌మోహన్‌ రెడ్డి, శ్రీనివాసరాజు, కానిస్టేబుల్స్‌ ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేష్‌బాబులు తమ వంతు కృషి చేశారనీ, సిఐ అభినందించారు. ఈ సమావేశంలో రైల్వే ప్రొటెక్షన్‌ ఇన్స్‌పెక్టర్‌ నార్నరాం, కానిస్టేబుల్‌ మనోహర్‌లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు