ఐదు వందల కోట్ల నకిలీ డ్రగ్స్‌ సీజ్‌..

16 Oct, 2017 13:38 IST|Sakshi

చిన్నపిల్లల  మందులను వదలని డ్రగ్స్‌ మాఫియా..

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భారీ స్థాయి నకిలీ డ్రగ్స్‌తయారీ గుట్టు రట్టైంది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ డ్రగ్స్‌ తయారవుతున్నాయన్న సమాచారం అందుకున్న రాచకండో పోలీసులు సోమవారం తయారీ కేంద్రంపై దాడి చేశారు. గర్భిణీలు ఎక్కువగా ఉపయోగించే ప్రోటీన్‌ పౌడర్‌, టానిక్స్‌, పిల్లలు తాగే మిల్క్‌ పౌడర్‌లను నకిలీగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు చిన్న పిల్లలు తాగే పాల పౌడర్‌, గర్బిణీలు ఉపయోగించే మందులను కల్తీ చేస్తుండటం నగరవాసులను కలవర పెడుతుంది. ఈ తయారీ కేంద్రం సహయజమానిగా గుర్తించిన రాజేందర్‌ రెడ్డి కోసం పోలీసులు వేట మొదల పెట్టారు.

మరిన్ని వార్తలు