చంచల్‌గూడ జైలులో రవిప్రకాశ్‌..

6 Oct, 2019 08:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దాదాపు రూ.18 కోట్లు చీటింగ్‌ చేసిన కేసులో  అరెస్ట్‌ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్‌ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్‌ ట్రయిల్‌ ఖైదీ నెంబర్‌ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్‌లో ఉంచారు.  ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం.  ఉదయం రవిప్రకాశ్‌కు జైలు సిబ్బంది అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా, సగం తిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి.

కాగా రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్‌ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు.

చదవండి: రవిప్రకాశ్‌ అరెస్ట్‌...

మరిన్ని వార్తలు