తప్పిన పెనుప్రమాదం

18 May, 2019 01:09 IST|Sakshi

కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు  

25 మందికిపైగా తీవ్రగాయాలు

జైపూర్‌(చెన్నూర్‌): ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండల కేంద్రంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుడి సమీపంలో మంచిర్యాల–చెన్నూర్‌ 63వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు (అద్దె బస్సు) శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఎల్లమ్మగుడి సమీపంలోకి రాగానే.. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును వేగంతో ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిపైఒకరు పడిపోయారు.

బస్సు అద్దాలు, సీట్లు, ఇనుపరాడ్లు బలంగా తాకడంతో ప్రయాణికుల తలలు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్‌తో సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పప్రతికి తరలించి చికిత్స అందించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించి మంచిర్యాలకు రెఫర్‌ చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, నిద్రమత్తుతో బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్‌ మాత్రం బ్రేక్‌ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నాడు. వరుసగా చోటు చేసుకుంటున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో పైశాచిక ఘటన

భగ్గుమన్న అలర్లు.. కాల్పుల్లో ఇద్దరు మృతి

బెంగాల్‌లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి

‘ఆమె పబ్‌ డ్యాన్సర్‌ కాదు’

సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌

తండ్రిని హతమార్చిన తనయుడు!

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం

ప్రాణత్యాగమా.. బలిచ్చారా

తిరుమల వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

ఏసీబీ వలలో ‘ఎక్సైజ్‌’ చేపలు!

మల్టీప్లెక్స్‌ థియేటర్‌ సీజ్‌

దాసరి ప్రభును తీసుకెళ్లిన మహిళ ఎవరు?

భర్త వేధింపులు తాళలేక..

వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం

రోడ్డు ప్రమాదంలో సీపీఐ నేత దుర్మరణం

‘జాతీయత లేని’ షేర్‌ అలీ కేష్వానీ..

ఆమె ఆ‍త్మహత్యకు అత్తింటివారే కారణం

‘తీగ’ లాగితే...

చింతమనేనిపై కేసు నమోదు

గమ్యం చేరకుండానే..

ఏసీబీ వలలో పంచాయతీ కమిషనర్‌

కసాయి తండ్రి

చంపేశారయ్యా... 

సంసారానికి పనికిరాకున్నా.. ఘరానా మొగుడు

ఎద్దుల బండిని ఢీకొన్న లారీ

ప్రేమించడం పాపమా.. శాపమా?

సోదరుడు కాదు..ఉన్మాది  

పుణెలో కౌకుంట్లవాసి దుర్మరణం

వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్‌ అమ్మా..

శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హీరో సోదరి

'సూపర్‌ 30' ఆనంద్‌కుమార్‌ ఇంటర్వ్యూ

ప్రేక్షకుల్ని మాయ చేస్తున్న ఫకీర్‌

‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ మళ్లీ వస్తోంది!

తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ మెప్పిస్తాడా!