చెరువులోకి దూకి ఆత్మహత్య!

9 Nov, 2023 08:20 IST|Sakshi

కర్ణాటక: గుర్తుతెలియని మహిళ హనీ ట్రాప్‌లో పడిన విశ్రాంత సైనికుడు డెత్‌నోట్‌ రాసి అదృశ్యమైన ఘటన కొడగు జిల్లా మడికెరిలో చోటుచేసుకుంది. అదృశ్యమైన సైనికుడు సందేశ్‌ (40)గా గుర్తించారు. మంగళవారం ఇంటి దగ్గర ఉన్న చెరువు గట్టున అతని మొబైల్‌ఫోన్‌, చెప్పులు లభించాయి. దీంతో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చెరువులో ఫైర్‌ సిబ్బంది, మడికెరి పోలీసులు గాలిస్తున్నారు. సందేశ్‌కు కొంతకాలం కిందట ఫేస్‌బుక్‌లో వివాహిత మహిళ పరిచయం చేసుకుంది. ఇద్దరూ ప్రైవేటు ఫోటోలను పంపుకున్నారు. షికార్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆపై ఆమె పదే పదే డబ్బు ఇవ్వాలని, లేకపోతే గుట్టు రట్టు చేస్తానని సందేశ్‌పై వేధింపులకు పాల్పడింది. ఆమె పోరు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సందేశ్‌ డెత్‌నోట్‌ రాశాడు. న్యాయం చేయాలని సందేశ్‌ భార్య భోరున విలపించింది.

మరిన్ని వార్తలు