పుట్టిన రోజునే..

22 Nov, 2018 08:03 IST|Sakshi
కళింగపట్నం బీచ్‌లో తీసుకున్న సెల్ఫీ పొందూరు: రోదిస్తున్న చంద్రమౌళి తల్లి, కుటుంబ సభ్యులు

 కళింగపట్నం బీచ్‌లో విద్యార్థి గల్లంతు  

కన్నీరు మున్నీరవుతున్న కన్నవారు

గాలింపు చర్యలు చేపడుతున్న మెరైన్‌ పోలీసులు

పుట్టిన రోజు కావడంతో ఉదయం నుంచి తల్లిదండ్రులతో ఆ యువకుడు ఆనందంగా గడిపాడు. ఆలయాలకు వెళ్లి పూజలు చేశాడు. తరువాత స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకూ అక్కడే సందడి చేశారు. మరికొద్దిసే పట్లో ఇంటికి తిరిగిముఖం పడతారకుంటున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం సముద్రంలో దిగి యువకుడు గల్లంతయ్యాడు. దీంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి కన్నవారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పొందూరు మండలం నందివాడ గ్రామానికి చెందిన మజ్జి చంద్రమౌళి (17) కళింగపట్నం బీచ్‌లో గల్లంతు కావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.

శ్రీకాకుళం, గార/పొందూరు:  నందివాడ గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ, సర్వలక్ష్మి దంపతులకు కుమారుడు చంద్రమౌళి, కుమార్తె భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటరమణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమారుడు చంద్రమౌళి (17) పొందూరు మండలం వావిలాపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) రెండో ఏడాది చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు సెలవు కావడంతో పాటు తన పుట్టినరోజు కలసి రావడంతో ఆనందంగా గడపాలని భావించాడు. మంగళవారమే స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం గార మండలం కళింగపట్నం బీచ్‌కు వెళ్లాలని నిర్ణయిం చకున్నారు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు ఆశీస్సులు చంద్రమౌళి తీసుకున్నాడు. అనంతరం 11 మంది స్నేహితులతో కలిసి ఆటోలో కళింగపట్నం బీచ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో ఎచ్చె ర్ల మండలం కుంచాలకుర్మయ్యపేటలోని దేవీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు. అక్కడ నుంచి బీచ్‌కు వెళ్లారు.  స్నేహితులతో కలిసి బీచ్‌లో సందడిగా గడిపారు. సెల్ఫీలు తీసుకొని తల్లి దండ్రులకు చంద్రమౌళి వాట్సాప్‌లో పోస్టు చేశా డు. వాటిని చూసి కన్నవారు మురిసిపోయారు. స్నేహితులకు కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఫొటోలను వాట్సాప్‌లో పంపించాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ బీచ్‌లో సందడిగా స్నేహితులంతా గడిపారు. అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అయితే ఇక్కడే విషాదం నెలకొంది. పుట్టిన రోజును సంతోషంగా జరుపుకుంటున్న చంద్రమౌళిని రాకాసి అల ఉవ్వెత్తిన వచ్చి ఈడ్చుకుపోవడంతో గల్లంతయ్యాడు. దీన్ని చూసి మిగిలిన స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపుచర్యలు చేపట్టా రు. అయినా రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లేదు. 

మెరైన్‌ పోలీసులు వద్దంటున్నా..
బీచ్‌లో స్నానానికి దిగవద్దని విధుల్లో ఉన్న మెరైన్‌ పోలీసులు మైక్‌లో హెచ్చరించారు. అయితే చంద్రమౌళితోపాటు అతని స్నేహితులు వీటిని పట్టించుకోకుండా సముద్రంలోకి దిగారు. వీరిలో చంద్రమౌళి గల్లంతయ్యాడు. పడవలో మెరైన్‌ సీఐ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి చంద్రమౌళి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని గార ఏఎస్సై తలే రామారావు తెలిపారు.

మరిన్ని వార్తలు