గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

8 Sep, 2019 14:50 IST|Sakshi

ఏ.కొండూరులో తండాలో విషాదం

సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా ఏ కొండూరు వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకొంది. గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. అందరూ చూస్తుండగానే వాళ్లంతా జలసమాధి అయ్యారు . చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక  ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు. మృతులు బాణవతు గోపాలరావు,భూక్యా శంకర్, భూక్యా చంటిగా గుర్తించారు. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చెసి అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకూ ఎంతో సరదాగా గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్న యువకులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

మరిన్ని వార్తలు