అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

1 Aug, 2019 08:39 IST|Sakshi

సాక్షి శృంగవరపుకోట(విజయనగరం) : మండలంలోని మూలబొడ్డవర గ్రామానికి చెందిన డిప్పల సింహాచలం (14) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతి చెందాడు. సింహాచలం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వరుసకు అన్నయ్య అయిన తోటి విద్యార్థితో కలిసి సింహాచలం మూలబొడ్డవరలో గల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి సింహాచలం హాస్టల్‌కు వెళ్లకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారి ఎం.  భాస్కర్‌ ఆరా తీయగా ఇంటి వద్ద ఉన్నట్లు తేలింది.  

ఇంతలో హఠాత్తుగా ఈ నెల 30న సింహాచలం అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తండ్రి అడివేసు కుమారుడ్ని ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద గల ప్రైవేట్‌ ల్యాబ్‌కు తీసుకువచ్చి రక్తపరీక్షలు చేయించగా.. హిమోగ్లోబిన్‌ 2.6 శాతం ఉన్నట్లు తేలింది. వెంటనే సింహాచలంను ప్రైవేట్‌ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యసేవలందించి.. ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బుధవారం మరో ఆస్పత్పికి తీసుకెళ్దామనుకున్న సమయంలో ఘోరం జరిగిపోయిందని విద్యార్థి తల్లిదండ్రులు అంకాలమ్మ, అడివేసి బోరున రోదిస్తూతెలిపారు. ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న విద్యార్థి సింహాచలం మృతి చెందడంతో మూలబొడ్డవర గ్రామంలో విషాదం నెలకొంది.

ప్రభుత్వం ఆదుకోవాలి..
 మృతి చెందిన గిరిజన విద్యార్థి డి.సింహాచలం కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ గిరిజన సంఘ డివిజన్‌ కార్యదర్శి జె.గౌరీష్, సభ్యులు ఆర్‌.శివ, జి.గౌరినాయుడు డిమాండ్‌ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు విషజ్వరాల బారిన పడుతున్నప్పటికీ హాస్టల్‌ వార్డెన్, ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మృతి చెందుతున్నారన్నారు.

దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు.. 
విద్యార్థి సింహాచలం సికిల్‌సెల్‌ ఎనీమియా, రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ అనే వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్నాడని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ వార్డెన్‌ ఎం.భాస్కర్‌ తెలిపారు. 2014లో విశాఖలోని కేజీహెచ్‌లో కూడా చికిత్స తీసుకున్నాడన్నారు. గతేడాది జనవరిలో ఆశ్రమ పాఠశాలలో చేరి అంతలోనే డ్రాపౌట్‌ అయ్యాడని తెలిపారు. మరలా జూన్‌ 2019లో విద్యార్థి డి.సింహాచలం 5వ తరగతిలో చేరాడని, ఈ నెల 21వ తేదీన ఇంటికి వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. హాస్టల్‌లో ఏఎన్‌ఎం ఉంటున్నారని, ఎప్పటికప్పుడు కొట్టాం పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వెళ్తుంటారని తెలిపారు. ఇదిలా ఉంటే సింహాచలం మృతి వార్త తెలుసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పీవీ ప్రసాదరావు, ఏటీడబ్ల్యూఓ వరలక్ష్మి, వార్డెన్‌ ఎం.భాస్కర్‌ మూలబొడ్డవర వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం హెచ్‌ఎం ప్రసాదరావు రూ. ఐదు వేల ఆర్థిక సాయం చేశారు.

కుమారుడి మృతదేహం వద్ద దీనంగా రోదిస్తున్న తల్లి, కుటుంబసభ్యులు  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

యువకుడి దారుణహత్య

కుమార్తెపై లైంగికదాడికి యత్నం  

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ఫోర్జరీ సంతకాలతో 1.30కోట్లు స్వాహ!

ఫ్యాన్స్‌ వార్‌.. కత్తితో దాడి

కలెక్టరేట్‌ ఎదుట.. మహిళ ఆత్మహత్యాయత్నం

నెత్తురోడిన రహదారులు

కొంపల్లిలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

ప్రేమించి పెళ్లాడి ఆపై..

బాంబు పేలుడు..34 మంది మృతి!

‘ఏసీబీ’కి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..