'టీడీపీ ఫేక్‌ హ్యాష్‌ ట్యాగ్‌లపై పక్కా ఆధారాలు'

7 Mar, 2019 18:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తోందని టీఆర్ఎస్ యూత్ వింగ్ సభ్యులు మండిపడ్డారు. ఫేక్ ట్వీట్‌లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన టీడీపీనేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

టీడీపీ ఐటీ వింగ్ నుండే సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయని టీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు జగన్‌ పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ల నుండి తెలుగు భాషలో పెద్ద మొత్తంలో తప్పుడు ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లను పోస్ట్‌ చేపించడంలోనే టీడీపీ వక్రబుద్ది బయటపడిందని అన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు