తిరుపతిలో దొంగల హల్‌చల్‌

18 Aug, 2018 20:12 IST|Sakshi

తిరుపతి: నగరంలో శనివారం దొంగలు హల్‌చల్‌ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలోకి ప్రవేశించిన దొంగలు పెళ్లి బృందం తెచ్చుకున్న నగలను చాకచక్యంగా దోచుకెళ్లారు. బాధితులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. మొత్తం 55 గ్రాముల బంగారంతో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తోన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు