ఆసియా క్రీడల​ ప్రారంభ సంరంభం

18 Aug, 2018 20:55 IST|Sakshi

జకార్త: ఇండోనేసియా వేదికగా 2018 ఆసియా క్రీడల సంరంభం మొదలైంది. నాలుగుసంవత్సరాలకొకసారి నిర్వహించుకునే పదహారు రోజుల సంగ్రామానికి తొలి వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకర్తాలో అంగరంగ వైభవంగా  మొదలైంది. ఇండియా నుంచి ఇండోనేసియా చేరుకున్న టార్చ్‌తో  క్రీడాజ్యోతిని వెలిగించి బాడ్మింటన్‌ లెజండరీ ప్లేయర్‌ సుశి సుశాంత్‌ వేడుకులకు గ్రాండ్‌ ఓపెనింగ్‌ ఇచ్చారు. క్రీడాకారులు, కళాకారులతో గెలోరా బుంగ్ కర్నో స్టేడియం కన్నుల పండువగా నిలిచింది.  స్థానిక సంప్రదాయ కళారూపాలతోపాటు, లైట్‌ షో  ఆహూతులను విపరీతంగా అలరించాయి.

జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారతీయ క్రీడా, అధికార బృందానికి పరేడ్‌లో నాయకత్వం వహించాడు. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్‌ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. పోటీలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి.

మరిన్ని వార్తలు