వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

19 Aug, 2019 06:53 IST|Sakshi
రామదాస్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు 

భర్తను కడతేర్చిన భార్య

ప్రియుడితో కలిసి హత్య

సాక్షి, గుడిపాల : తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తపార పంచాయతీకి చెందిన ధర్మరాజులపురంలో రామదాస్‌(36), మొగిలమ్మ(30) దంపతులు నివాసం ఉంటున్నారు. మొగిలమ్మకు అదే గ్రామానికి చెందిన ఉమాపతి(26)తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. ఉమాపతికి మొగిలమ్మ రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చింది. అంతేగాక బంగారు నగలు కూడా అందజేసింది. ఈ విషయం మొగిలమ్మ భర్తకు తెలిసింది. అతను డబ్బు, బంగారు ఆభరణాలు ఇప్పించుకోవాలని భార్యను డిమాండ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మొగిలమ్మ తన ప్రియుడు ఉమాపతిని ఇంటికి పిలిపించుకుంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటిముందు పశువుల పాకలో నిద్రిస్తున్న రామదాస్‌ను గొంతుకోసి హత్య చేశారు.

ఆ సమయంలో మొగిలిమ్మ తన భర్త కాళ్లు పట్టుకుంది. చేతులను కట్టేసి ఉమాపతి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మొగిలమ్మ ప్రియుడు ఉమాపతిని చిత్తపార బస్టాప్‌ వద్దకు వెళ్లిపోమని చెప్పింది. తెల్లవారుజామున తన భర్తను ఎవరో చంపేశారంటూ కేకలు పెట్టింది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు విషయాన్ని గుడిపాల పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ షేక్‌షావలి సంఘటనా స్థలానికి చేరుకుని రామదాస్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మొగిలమ్మను, ఉమాపతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా మొగిలమ్మ గతంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో కాణిపాకంలో లాడ్జిలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తపార గ్రామంలో సారా విక్రయిస్తున్నట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటుడు ఫిర్యాదు చేయడంతో.. వంచకుడు అరెస్టు

మహిళా పోలీసుస్టేషన్‌లో లాకప్‌ డెత్‌..?

వివాహమై పదేళ్లవుతున్నా..

ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్‌ బస్సు

సోషల్‌ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు

పెళ్లిలో పేలిన మానవబాంబు

ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి  

మహిళా అధికారికి బెదిరింపులు: ఇద్దరు అరెస్ట్‌

తిరుత్తణి హత్య కేసు: నిందితుడు అరెస్ట్‌

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

తండ్రీకూతుళ్లను కలిపిన గూగుల్‌

వీడు మామూలోడు కాడు : వైరల్‌

చినబాబు అరెస్ట్‌, జ్యోతికి బ్లూ కార్నర్‌ నోటీస్‌!

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

ప్రజారోగ్యం పణంగా పెట్టి..

పిన్నితో వివాహేతర సంబంధం..!

కృష్ణానదిలో దూకిన మహిళ

అత్తా ! నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో

బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య!

సాండ్‌విచ్‌ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!

మహిళ సాయంతో దుండగుడి చోరీ

పెళ్లిలో ఆత్మాహుతి దాడి..!; 63 మంది మృతి

అర్చకుడే దొంగగా మారాడు

ఇస్మార్ట్‌ ‘దొంగ’ పోలీస్‌!

నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ

బాలికను తల్లిని చేసిన తాత?

వసూల్‌ రాజాలు

వేధింపులే ప్రాణాలు తీశాయా?

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం

కోడెల కుమారుడిపై కేసు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోనటి ఆత్మహత్యాయత్నం

ఏ కథకైనా  ఎమోషన్సే ముఖ్యం

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక