వ్యాపారి భార్యపై దొంగల అఘాయిత్యం: సిగరెట్లతో కాల్చి టార్చర్‌

16 Nov, 2023 18:53 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతని భార్యను గ్యాంగ్‌ రేప్‌ చేసి, సిగరెట్లతో   కాల్చిన ఘటన సంచలనం రేపింది. యూపీ బిజోర్‌లోని నగీనా దేహత్‌లో  మంగళవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసుల సమాచరం  పెయింట్-హార్డ్‌వేర్ హోల్‌సేల్ వ్యాపారి  తన తల్లి ,పిల్లలతో కలిసి మందులు కొనడానికి బయటకు వెళ్లారు.  అదును చూసిఇంట్లోకి చొరబడిన ఐదుగురు దొంగలు మహిళపై దాడి చేసి, ఆమెను కట్టేసి, సిగరెట్‌ పీకలతో కాల్చి టార్చర్‌ పెట్టారు.   అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె స్పృహ తప్పడంతో ఇంట్లోని అల్మారాల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, సుమారు రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచేశారు. అనంతరం ఇంట్లో ఉన్న స్కూటర్‌తో అక్కడినుంచి పరారయ్యారు. 

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు  వైద్య పరీక్షల కోసం పంపించామని  రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు