ల్యాంకో హిల్స్‌పై నుంచి దూకి యువతి ఆ‍త్మహత్య

13 May, 2020 11:38 IST|Sakshi
ల్యాంకో హిల్స్‌ భవనం.. వల్లిక మృతదేహం

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మణికొండలో దారుణం చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వెళ్లలేక మనస్తాపానికి గురైన ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఈర వల్లిక అనే 20ఏళ్ల యువతి గత రెండు నెలలుగా ల్యాంకో హిల్స్‌లోని ఓ ఇంటిలో పని చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వెళ్లలేకపోవటంతో గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోంది. 33 ఏళ్ల క్రితం తల్లిని చంపి: ఇప్పుడు కొడుకును.. )

ఈ నేపథ్యంలో ఊర్లో ఉన్న తల్లికి ఫోన్ చేసిన వల్లిక ‘‘అమ్మా! అక్క పిల్లలను చూడాలని ఉంది’’ అని అడిగింది. లాక్‌డౌన్‌ వల్ల ఇంటికి రావటానికి కుదరదు అని ఆమె చెప్పడంతో మనస్తాపం చెందింది. ఉదయం పనికి వెళ్లిన తర్వాత ల్యాంకో హిల్స్‌ 15వ అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

చదవండి : మిత్ర ద్రోహి.. స్నేహితుడి సోదరిని..

మరిన్ని వార్తలు