యువకుడి బలవన్మరణం.. ఇంట్లో దొరికిన ప్రేమ లేఖ

5 Nov, 2018 06:59 IST|Sakshi
మహేష్‌(ఫైల్‌) ఉరి వేసుకున్న యువకుడు మహేష్‌

ప్రేమ వ్యవహరమే కారణమని అనుమానం

విశాఖపట్నం, ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): స్థానిక దుర్గాపురంలో ఓ యువకుడు  ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు, మహేష్‌ అక్క పుష్ప తెలిపిన వివరాలు ప్రకారం .. దుర్గాపురంలో నివాసముంటున్న కల్లేపల్లి మహేష్‌ (25) ఆదివారం సాయంత్రం తన ఇంట్లో  పైకప్పు హుక్కుకు దుప్పటి కట్టి ఉరివేసుకున్నాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తన పిల్లలతో పాటు మహేష్‌కు టిఫిన్‌ పెట్టింది. మధ్యాహ్నం సమయంలో భోజనం పెట్టేందుకు  చూడగా తాళం వేసి ఉంది. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో  గ్యాస్‌ బండ అవసరమై ఇంటికి వెళ్ల గా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపు కొట్టినా తీయలేదు. వెనుక వైపు నుంచి తలుపు కొట్టారు. అయినా తీయక పోవడంతో అనుమానం వచ్చి తలుపు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. లోపలి గొల్లెం విరగడంతో తెరుచుకుంది.  వెళ్లి చూసేసరకి వ్లాబ్‌ హుక్‌కు దుప్పటి కట్టి ఉరివేసుకున్నాడు. అయితే ఎందుకు ఉరి వేసుకున్నాడు.. ఆర్థిక ఇబ్బందులా! మరో కోణం ఏదైనా ఉందని పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఎస్‌ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

తల్లి దండ్రులు లేరు
మృతుడు మహేష్‌కు తల్లి దండ్రులు లేరు. కొన్నాళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు.ఇతను కొన్నాళ్లు కొరియర్‌ బాయ్‌గా పని చేశారు. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇటీవల పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇంట్లో దొరికిన ప్రేమ లేఖ
అయితే మహేష్‌ ఇంట్లో ఏడాది కిందట రాసిన ప్రేమ లేఖ దొరికింది. ఇందులో ఓ యువతికి మహేష్‌ ప్రేమతో రాసినట్లుగా ఉంది. దీంతో ప్రేమ వ్యవహరమే మృతికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు