మెంఫిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

3 Feb, 2016 22:29 IST|Sakshi

వాషింగ్టన్ : టెన్నెస్సీ రాష్ట్రం, మెంఫిన్ పట్టణంలో మెంఫిన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో 'సంక్రాంతి సంబరాలు' ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం స్థానిక 'సౌత్ విండ్ ఉన్నత పాఠశాల'ను అందంగా ముస్తాబయింది. సంక్రాంతిశోభ ఉట్టిపడే విధంగా వేదికను అందంగా అలంకరించారు. ఈ సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తెలుగు ఇంటి ఆడపచులు చేతులతో అందమైన రంగురంగుల రంగవల్లులు రూపు దిద్దుకున్నాయి. అలాగే సంక్రాంతి పాటలు పాడారు. ఈ వేదికపై జరిగిన భోగి పళ్ళ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహం గా పాల్గొన్నారు.

సంప్రదాయ సంగీత నృత్యాలతో ప్రారంభమయిన కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు సాగింది. చిన్నారులు సినీ గీతాలను అనుగుణంగా  చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. యువతులు చేసిన డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వర్ధమాన గాయకుడు సందీప్ కురపాటి పాల్గొన్నారు. ఆయన తనదైన శైలిలో పాడిన పాత,  కొత్త తెలుగు చిత్రాల్లోని గీతాలు ఆహ్వానితులను కట్టిపడేశాయి.  కమిటి సభ్యులతోపాటు తెలుగువారు వండి వడ్డించిన విందు భోజనం అందరి మెప్పు పొందింది.

ఈ సంబరాలను పురస్కరించుకుని తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెంఫిన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ముద్దు మాటలు, పద్యాలు, బుల్లికథలు, వ్యాసాలు, ఆహా ఏమిరుచి, ఆహా ఏమి రుచి, గోరింటాకు, ముత్యాల ముగ్గులు తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహాకులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిన్ అధ్యక్షుడు యెదురు పుల్లారెడ్డి గారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది. ఉపాధ్యక్షుడు గోపి జవాబ్ నవీస్, సహా ఉపాధ్యక్షుడు రంజిత్ కొమరవెల్లి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండలపు, సహ ప్రధాన కార్యదర్శి మదన్ వెన్న, కోశాధికారి సుబ్బారెడ్డి కర్నాటి, సహా కోశాధికారి రమేష్ నర్సాపురం, సాంసృతిక కార్యదర్శి రత్నాకర్రావు వాన, సాంసృతిక సహా కార్యదర్శి స్వప్న వొంటరి, క్రీడల విభాగ కార్యదర్శి శ్రీనివాస్ బుసిరెడ్డి, క్రీడల విభాగ సహా కార్యదర్శి అరవింద్ నూనె, ఫుడ్ కమిటీ చైర్ పర్సన్ చంద్రశేఖర్ పొట్నూరు,  క్రియేటివ్ డైరెక్టర్ సత్య ప్రోద్దుటూరి, మీడియా చైర్ పర్సన్ సింధూర కల్లేపల్లి, యూత్ కమిటీ చైర్ పర్సన్ రవిపోలూరి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ రాజేంద్ర తంగళ్లపల్లి, మార్కెటింగ్ కమిటీ ఉప చైర్ పర్సన్ అరుణ్ ద్యసాని మరియు ధర్మకర్తల అధ్యక్షుడు వీరభద్రం నరిశెట్టి, ధర్మకర్తలు స్వామి పొలస, ఉదయ్ నట్ర , రాజ్ తోట మరియు  సురేశ్ కొత్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. 2015 వ సంవత్సరంలో సేవలు అందించిన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికలను అందజేశారు. గత మూడుసంవత్సరాలుగా సేవలు అందించిన ధర్మకర్త, శేషాద్రి బెల్డే గారికి ప్రత్యెక కృతజ్ఞత తెలుపుతూ జ్ఞాపిక అందజేశారు.

మరిన్ని వార్తలు