ఘనంగా తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు

28 Jun, 2017 22:14 IST|Sakshi
ఘనంగా తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్- యూఎస్ఏ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ  దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనని సంక్షేమ పథకాలు తెలంగాణ లో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సస్యమలంగా మార్చేందుకు సీఎం ప్రాజెక్టులను రూపకల్పన చేశారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు విడుదల చేశామన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కుల వృత్తులను పోత్సహిస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించమని తెలిపారు. పేదింటి ఆడపడుచుల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు.

ఆసరా పథకం ద్వారా వృదులకు, వికలాంగులకు, వితంతువులకు, వంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కలిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో నెంబర్ వన్ చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు పెట్టుబడి కోసం వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4000 అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. అమరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం అన్నారు. అమరులు కళలు కన్నా బంగారు తెలంగాణ సాకరం అవుతుందన్నారు. అందుకు తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ జలగం స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ ని రజనీకాంత్ ఖొసనం పుష్ప గుచంతో స్టేజి మీదకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రొఫెసర్ జయశంకర్, జల వనరుల నిపుణులు విద్య సాగర్రావుకి  నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో నవీన్‌ జలగం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలే కాకుండా తెలంగాణ ప్రజల కోసం వాటర్ గ్రిడ్, నిరంతర విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలని చేపట్టారని అ‍న్నారు.

ఫ్రీమాంట్ మేయర్ లిలీ మీ మాట్లాడుతూ నగరంలో వివిధ రకాల కల్చర్స్ ని పోత్సహిస్తున్నమని వెల్లడించారు.తనను ఆహ్వానించినందుకు తెలుగుతో ధన్యవాదాలు తెలిపారు. భాస్కర్ మద్ది ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్మయి ప్రదర్శించిన తెలంగాణ నృత్యం రూపకం పేరిణి అందరిని ఆకట్టుకుంది. జానపద గేయాలను ప్రసాద్ ఊటుకూరు, భాస్కర్ కాల్వ, కృష్ణ వేముల పాడారు. ఆనంతరం చిన్నారుల నృత్యాలతో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనిత్ ఎర్రబెల్లి మాట్లాడుతూ సంక్షేమం పథకాల గురించి వివరించారు. రిషేకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల వాళ్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపోందుతుందని వెల్లడించారు. అభిలాష్ రంగినేని మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఉద్యమ సమయంలో, ప్రస్తుతం చేస్తున్న సేవలను కొనియాడారు. బే ఏరియాలో తెలంగాణ రాష్ట్ర అవతరాణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో నాయకులు శ్రీనివాస్ పొన్నాల, తేజస్విని వడ్డెరాజ్, వంశీ కొండపాక, ఉదయ్ జొన్నల, కరునకర్, సాగర్, రాజ్, రామ్, షషాంక్, శశి, క్రిష్ణ, హరింధర్, సంతోష్, రవి, నవీత్ విజయ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు