100 పద్యాలు ఆలపించి రికార్డు సృష్టించారు

12 Dec, 2016 15:05 IST|Sakshi
100 పద్యాలు ఆలపించి రికార్డు సృష్టించారు
పోడూరు : మండలంలోని వెయ్యి మంది విద్యార్థులు ఒకే వేదికపై 45 నిముషాల్లో 100 పద్యాలు ఆలపించి 7 రికార్డులు నెలకొల్పారు. పోడూరు కల్నల్‌ డీఎస్‌ రాజు జెడ్పీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో పాలకొల్లు క్షీరపురి సాహితీ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోడూరు, పండితవిల్లూరు, కవిటం జెడ్పీ హైస్కూల్స్, జిన్నూరు ఐడియల్‌ స్కూల్‌ విద్యార్థులు వెయ్యి మంది ఈ ఆలాపనలో పాల్గొన్నారు. ముందు 100 నిమి షాల్లో 100 పద్యాలు పాడాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. కేవలం 45 నిముషాల్లోనే 100 పద్యాలు పాడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరి తరువాత ఒక పద్యాలు ఆలపించారు.
గర్వకారణం : ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇటువంటి రికార్డులు నెలకొల్పడం గర్వకారణమని  ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రికార్డుల ప్రదానం సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.  ప్రపంచ రికార్డు సాధకుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు, భారత్‌ బుక్, ఆంధ్రా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ డాక్టర్‌ శ్యామ్‌ జాదూగర్‌తో ఎమ్మెల్యే కలసి క్షీరపురి సాహితీ సమితి ప్రతినిధులకు రికార్డులు ప్రదానం చేశారు.  శ్యామ్‌ జాదూగర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ రికార్డులు నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రికార్డుల సాధనకు నైపుణ్యం గల వ్యక్తులను, కళాకారులను, ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. రికార్డులు సాధించిన విద్యార్థులను, క్షీరపురి సాహితీ సమితి ప్రతినిధులను ప్రముఖులు అభినందించారు. శ్యామ్‌ జాదూగర్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణను ఎమ్మెల్యే పితాని చేతులమీదుగా నిర్వాహకులు సత్కరించారు. జెడ్పీటీసీ బొక్కా నాగేశ్వరరావు, సర్పంచ్‌ కుసుమె మోషేన్, ఏఎంసీ వైస్‌ చైర్మ¯ŒS రుద్రరాజు రవి, ఎంపీటీసీ సభ్యులు పోతుమూడి అనసూయ, ఐడియల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ ఏవీ సుబ్బారావు, క్షీరపురి సాహిత్య సమితి ప్రతినిధి పెన్మెత్స జగపతిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు