ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు

12 Dec, 2016 15:01 IST|Sakshi
ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు
- జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
        
పాణ్యం: ర్యాగింగ్‌ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. పాణ్యం సమీపంలోని ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలను బుధవారం ఆయన సందర్శింశారు. ఐటీ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై కళాశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారని.. వీటిని గోప్యంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలిని సూచించారు.   హాస్టళ్లలో ప్రతిగదిలో, బహిరంగ స్థలాల్లో పోలీస్‌ హెల్పలైన్‌ నంబర్లు రాయాలని తెలిపారు. అక్కడున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌తో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, ఉషారాణి ఘటన ఎంతో బాధ కల్గించిందన్నారు. అనంతరం కాన్ఫరెన్స్‌హాల్‌లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఉషారాణి మృతికి నివాళులర్పించారు. కేసును ప్రభుత్వం సీబీసీఐడికి అప్పగించినందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఎస్పీ వెంట నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారినికి కఠినమైన శిక్ష విధించాలని ఎపీఎస్‌ఎప్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. 
 
మరిన్ని వార్తలు