అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం

15 Sep, 2016 18:31 IST|Sakshi
అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం
దురాజ్‌పల్లి (చివ్వెంల) : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీఓ వి.సురేష్‌మోహన్‌ అన్నారు. గురువారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో అక్రమంగా చేసిన వెంచర్లను పరిశీలించారు. నిబంధలనకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో హద్దురాళ్లను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, నాలా పన్ను కట్టకుండా అక్రమంగా చేసిన చివ్వెంల మండలం బీబిగూడెం, కుడకుడ, దురాజ్‌పల్లి, సూర్యాపేట మండలం గాంధీనగర్, పిల్లలమర్రి, రాయిన్‌గూడెం గ్రామాల్లోని వెంచర్లను తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లలో ఎవరు ప్లాట్లు కోనుగోలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో ఈఓఆర్డీలు లక్ష్మి, గోపి, సూర్యాపేట, చివ్వెంల మండలాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు