నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

20 Jul, 2016 20:18 IST|Sakshi
దానిమ్మతోటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
  •  అనుమతిలేని దుకాణాల్లో విత్తనాల విక్రయాలు నేరం
  •  డీడీఏ బొబ్బిలి సింగారెడ్డి హెచ్చరిక
  • హన్వాడ: ఫర్టిలైజర్‌ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మహబూబ్‌నగర్‌ వ్యవసాయశాఖ డీడీ(పీపీ) బొబ్బిలి సింగారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న విత్తనాలు, రికార్డులను పరిశీలించారు.  ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పకుండా రశీదు తీసుకోవాలని సూచించారు.
       మండలంలోని పలు గ్రామాల్లో లైసెన్స్‌ లేని దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని, అలాంటి వారు ముందుకు వస్తే వారికి షాపు నిర్వహణకు అనుమతులు జారీ చేస్తామన్నారు. లేనిచో మరో 15రోజుల్లో వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు ఆయన మండల వ్యవసాయాధికారి చంద్రమౌళికి ఆదేశాలు జారీ చేశారు.
     
    దానిమ్మ తోట పరిశీలన..
    మండలంలోని మునిమోక్షం శివారులో సేంద్రియ పద్ధతిలో సాగవుతున్న దానిమ్మతోటను డీడీ బొబ్బిలి సింగారెడ్డి బుధవారం పరిశీలించారు. అదేవిధంగా గచ్చిబౌళి త్రిపుల్‌ఐటి ప్రొపేసర్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డితో కలిసి సాగుపద్ధతులను పర్యవేక్షించారు. ఆత్మషీల్డ్‌ ద్వారా త్వరలో జిల్లాలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నామని ఆయన వెల్లడించారు. మండలంలో అత్యధికంగా 2వేల ఎకరాల్లో సాగవుతున్న మొక్కజొన్న పాలిపోయినట్లుగా అయితే రైతులు 2శాతం యూరియాను పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందని సూచించారు. జిల్లాకు 34,600 క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని, అవసరమున్న డీలర్లు సంప్రదించినట్లయితే సరఫరా చేయనున్నామన్నారు. ఆయా మండలాల్లోని సొసైటీలకు సైతం సరఫరా చేస్తామని, యూరియాకు లోటు లేదని ఆయన వెల్లడించారు.
మరిన్ని వార్తలు