పదివేల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

1 Jun, 2016 18:22 IST|Sakshi
పదివేల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

విజయవాడ: రాష్ట్రంలో పదివేల ఖాళీలను భర్తి చేసేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో గ్రూప్ 1 ద్వారా 94, గ్రూప్ 2లో 750 పోస్టులు, గ్రూప్ 3 కేటగిరీలో 1000 పోస్టులు భర్తి చేయానున్నారు. అలాగే పోలీసు శాఖలో 6 వేల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తసుకుంది. ఇకపోతే టెక్నిషియన్స్ 1000, వైద్య ఆరోగ్య శాఖలో 422, వివిధ శాఖల్లోని 732 ఇతర పోస్టులు భర్తీకీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై రెండు విడతలుగా సర్వే చేపట్టాలని.. తొలి విడతగా జూన్ 20 నుంచి 30 తేదీ వరకు, రెండో విడతలో జులై 5 నుంచి 30 వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ శాఖకు చెందిన 'ఉదయ్' పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై జూన్ 8న ఒంగోలులో సంకల్ప సభ నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు