నాయీబ్రాహ్మణులకు ప్యాకేజీ ప్రకటించాలి

8 Jan, 2017 22:47 IST|Sakshi
నాయీబ్రాహ్మణులకు ప్యాకేజీ ప్రకటించాలి

కాల్వశ్రీరాంపూర్‌ : నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు సొన్నాయి టెంకం శివరామకృష్ణ, ప్రేంసాగర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాల్వశ్రీరాంపూర్‌లో శనివారం సంఘం మండలశాఖ ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా శిరామకృష్ణ, ప్రేంసాగర్‌ను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో పండుగలు, వివాహాది శుభకార్యల్లో నాయీబ్రాహ్మణులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని కులవృత్తులు అంతరించి పోతున్న తరుణంలో పూటగడవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, తమ వారికి ఉచితంగా కార్పొరేటు విద్య అందించాలని, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయీబ్రాహ్మాణుల తమ్మల్ల సొన్నాయి వాయిద్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  సంఘం గౌరవాధ్యక్షులుగా తూం సదానందం కోశాధికారిగా పందిల్ల సదానందం, జాయింట్‌ సెక్రటరిగా సూత్రాల వేణు, కార్యవర్గ సభ్యులుగా పందిల్ల రాజయ్య, స్వామి, సమ్మెట వెంకటేశ్‌ ఎన్నికయ్యారు.

శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటు చేయాలి
పెద్దపల్లిరూరల్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి విగ్రహాన్ని పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ పురోహితసంఘం జిల్లా ఎన్నికల కన్వీనర్‌ ముల్కల్ల గోవర్ధనశాస్త్రి డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో శనివారం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారందరినీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అక్కున చేర్చుకుని కీలక పదవులను అప్పగించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబీకులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో తాటికొండ సంతోష్‌కుమారాచారి, ముత్తోజు వీరబ్రహ్మచార్యులు, వెంకటాచార్యులు, సత్యనారాయణ, కట్ట గోపాలశాస్త్రి, కొమురవెళ్లి శివశంకరచార్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు