ఏపీకార్ల్‌ మరో ఉత్పత్తికి శ్రీకారం

22 Nov, 2016 22:52 IST|Sakshi
ఏపీకార్ల్‌ మరో ఉత్పత్తికి శ్రీకారం

పులివెందుల రూరల్‌ : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నతస్థాయి పశుపరిశోధన కేంద్రం(ఏపీ కార్ల్‌)లో గర్భకోశ వ్యాధి నిర్ధారణ టీకాల ఉత్పత్తికి అమెరికాకు చెందిన జినోమిక్స్‌ కంపెనీ శ్రీకారం చుట్టింది. పశువుల్లో  వచ్చే గర్భకోశ వ్యాధి నిర్ధారణకు సంబంధించి మూడు రకాల కిట్లను ఈనెల 17న ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పశు పరిశోధన సంస్థ(ఐకార్‌)లో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, సుదర్శన్‌ భగత్‌, ఇంటర్నేషనల్‌ బ్రూసెల్లా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నేఫన్‌, పలువురు ప్రముఖులు విడుదల చేశారు.  రైతులు తమ ఇంటి వద్దనే పరీక్షలు చేసుకొనే కిట్‌ (రాపిడ్‌ కిట్‌), పశువులో​‍్ల గర్భకోశ వ్యాధిని గుర్తించే కిట్‌  తయారు చేశారు. వీటిని ఇటీవల  విడుదల చేయడంతో ఏపీ కార్ల్‌లో పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. ఇదివరకే జినోమిక్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రానికి  పశువుల్లో వచ్చే పలు రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడే టీకాలు ఉత్పత్తి చేశారు.
రూ.18కోట్లతో కేంద్ర ప్రభుత్వంతో ఎంవోయూ
  కేంద్ర ప్రభుత్వంతో జినోమిక్స్‌ బయోటెక్‌ కంపెనీ వారు రూ18 కోట్లతో  కిట్లు తయారు చేసేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. కంపెనీ ఎండీ రత్నగిరి పులివెందులకు వచ్చారు.బుధవారం నుంచి వీటిని తయారు. చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.దీంతో పులివెందుల పేరు దేశంలోని నలుమూలకు విస్తరించనుంది.
 గర్భకోశ వ్యాధి నిర్మూలనే లక్ష్యం
పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా  కిట్లు తయారుచేయాని నిర్ణయించాం.దేశం మొత్తం వీటిని సరఫరా చేస్తాం. భవిష్యత్‌లో  ఇతర దేశాలకు పంపేలా  సన్నాహాలు చేస్తున్నాం.
– రత్నగిరి(జినోమిక్స్‌ కంపెనీ ఎండీ), పులివెందుల

 
 

మరిన్ని వార్తలు