ఉపాధ్యాయులు ఇక పంచెల్లోనే రావాలి

14 Apr, 2016 09:44 IST|Sakshi
ఉపాధ్యాయులు ఇక పంచెల్లోనే రావాలి

ప్రభుత్వ టీచర్లకు డ్రెస్ కోడ్
► వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
► పాఠశాల వేళల్లో సెల్ఫోన్ వాడకం నిషేధం
► విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
► ప్రభుత్వ నిర్ణయంపై టీచర్ల సంఘాల పెదవి విరపు


వైఎస్సార్ జిల్లా: పూర్వం ఉపాధ్యాయుడు అనగానే పంచెకట్టు, మెడలో తువ్వాలుతో హుందాగా కనిపించేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయుల్లో ఆధునికత సంతరించుకుంది. సమాజంలో గురువు స్ధానం ఎప్పటికీ గౌరవనీయమైపదే. అందువల్ల రేపటి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా అన్ని విధాలా ఆదర్శంగా ఉండాలన్నది అత్యధికుల భావన. సరిగ్గా అదే ఉద్దేశంతో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు వస్త్రధారణ సూచిస్తూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. తాజా మార్గదర్శకాల్లో ఉపాధ్యాయులు ఎలాంటి వస్త్రధారణ  పాటించాలనేది స్పష్టంగా సూచించనప్పటికీ, ధరించకూడనవి మాత్రం స్పష్టంగా తెలిపారు.
 
పాఠశాల పని వేళల్లో ఇవి ధరించకూడదు
  జీన్స్ ఫ్యాంట్     చిత్ర విచిత్ర రంగులున్న చొక్కా       రెండు, నాలుగు జేబులున్న చొక్కా      బూట్లు (షూ)

  టీ షర్ట్,             రౌండ్ నెక్ టీషర్ట్                              నాలుగు, ఆరు, ఎనిమిది జేబులు ఉన్న ప్యాంటు

పని వేళల్లో సెల్ ఫోన్లు నిషేధం
ఉపాధ్యాయులకు వస్త్రధారణ నిబంధనతోపాటు పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు వినియోగించకూడదు. సెల్ ఫోన్‌కు కాల్ వస్తే ఏకాగ్రత దెబ్బతిని ఆ ప్రభావం పాఠ్యాంశాలపై ఉంటుంది. ఎక్కువ మంది ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ఫోన్లు రావడం.. బయటకు వెళ్లి మాట్లాడటం పలు పాఠశాలల్లో నిత్యం చోటుచేసుకుంటోంది. మరికొంత మంది ఉపాధ్యాయులు తరగతి గదిలోనే సెల్‌ఫోన్ వినియోగించడం, వాట్సాప్ చూసుకోవటంలో నిమగ్నమవుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్) పాఠశాలల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నారు.

ఇదిలా ఉండగా హెడ్‌మాస్టర్ మొదలు ప్యూన్ వరకు అందరి వద్దా ప్రస్తుతం అధునాతన అండ్రాయిడ్ సెల్ ఫోన్లు ఉన్నాయి. తరచూ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల పని వేళల్లో సెల్ ఫోన్ వాడకంపై నిషేధాన్ని ఎంత వరకు సక్రమంగా అమలు చేయగలరనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఉపాధ్యాయులకు ప్రభుత్వంజు డ్రెస్ కోడ్ అమలు చేయనుండటంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భోదనా సామర్థ్యాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించేంకు ృషి చేయాల్సిన ప్రభుత్వం దాని గురించి మరిచిపోయి అనవసరంగా డ్రెస్ కోడ్ అంటే ఉపాధ్యాయులను మానసికంగా అందోళనకు గురుచేయడమే అంటున్నారు.

>
మరిన్ని వార్తలు