విద్యారంగ సమస్యలపై పోరాటం

28 Jul, 2016 20:47 IST|Sakshi
విద్యారంగ సమస్యలపై పోరాటం
 విజయవాడ (ఆనందపేట): ప్రత్యేక హోదాపై విద్యార్థులు సంఘటితంగా పోరాడాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఇన్‌చార్జి సాకే శైలజానాథ్‌ పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్‌ తేజ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా శైలజనాథ్‌ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూఐను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గహల్లో కమిటీల నియామకాలు చేపట్టాలన్నారు. పవన్‌తేజ మాట్లాడుతూ వసతి గహాల మూసివేతకు నిరసనగా ఈ నెల 29న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. మెస్‌ చార్జీలు పాఠశాల విద్యార్థులకు రూ.1500, కళాశాల విద్యార్థులకు రూ.2 వేలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి కిషోర్‌ బాబులు సంక్షేమ వసతి గహాల వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ శాసనసభ్యులు షేక్‌ మస్తాన్‌వలి, నాయకులు గారా ఉషారాణి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు డీఆర్‌కె చౌదరి, బోడా వెంకట్, కేశవ, గురవ కుమార్‌ రెడ్డి, తారక్, తదితరులు పాల్గొన్నారు.  
 
 
మరిన్ని వార్తలు