అందివచ్చిన అవకాశాలతో ఉన్నతంగా ఎదగండి

21 May, 2017 02:29 IST|Sakshi
అందివచ్చిన అవకాశాలతో ఉన్నతంగా ఎదగండి

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ అందివచ్చిన అవకాశాలతో ఉన్నతంగా ఎదగాలని బాస్కెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణలో భాగంగా శుక్రవారం పాలిటెక్నిక్‌ మైదానంలో అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్‌ చేస్తూ రాణించాలన్నారు.

అనంతరం అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులకు మెడల్స్‌ అందజేశారు. బాలికల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా అఖిల, బాలుర విభాగంలో బాల్‌రాజ్‌ ట్రోఫీలు అందుకున్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, జిల్లా కన్వీనర్‌ లక్ష్మీనారాయణభరద్వాజ్, యూత్‌ కన్వీనర్‌ రేహాన్, పులి జైపాల్, మహిళా కన్వీనర్‌ అపర్ణ, పీడీ సాయగౌడ్, పీఈటీలు సుమన్, నరేశ్, నాగరాజు, మూర్తి, రమేశ్, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు