రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

18 Oct, 2016 01:11 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం
 
శ్రీనివాసపురం(నాయుడుపేటౌన్‌): ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని శ్రీనివాసపురం సమీపంలో హైవేపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు.. మండలంలోని పూడేరు గ్రామానికి చెందిన పిలిమేటి సురేష్‌(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బాడుగకు వెళ్లి తిరిగి రాత్రి నాయుడుపేటకు వస్తున్నాడు. మార్గ మధ్యలో శ్రీనివాసపురం వద్ద హైవేపై చెన్నై నుంచి వస్తున్న కనిగిరి డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సురేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేసరికి అతను మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా వివరాలు తెలుసుకున్న సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
మరిన్ని వార్తలు