కొత్త బంధంతో కేంద్ర పదవికి దూరం

12 Dec, 2016 15:05 IST|Sakshi

కనీస వేతన సలహా సంఘ చైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా  
సాక్షి, హైదరాబాద్: కనీస వేతన సలహా సంఘం కేంద్ర చైర్మన్‌గా నియమితులైన బెక్కరి జనార్దన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించకుండానే రాజీనామా చేశారు. అందుకు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో తాజాగా ఏర్పడిన బంధుత్వమే కారణం కావడం విశేషం. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న జనార్దన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనకు కేంద్రంలో సముచిత పదవి ఇస్తామన్న హామీ మేరకు గతంలో పంపిన ప్రతిపాదనలు అనేక దశలు దాటి రెండు రోజుల క్రితం దేశస్థాయిలో కనీస వేతన చట్టం అమలును పర్యవేక్షించే సలహా సంఘానికి చైర్మన్‌గా ఉత్తర్వులు వెలువడ్డాయి.

అయితే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తెతో తన కుమారుడికి వివాహం జరుగుతున్న సమయంలో విమర్శలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన బుధవారం రాజీనామా లేఖను కేంద్రానికి పంపారు.

>
మరిన్ని వార్తలు