గుర్తింపు కార్డులతో కార్మికులకు ప్రయోజనాలు

24 Jul, 2017 22:33 IST|Sakshi

కదిరి అర్బన్‌: గుర్తింపు కార్డులు కలిగి ఉండే కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని మార్కెటింగ్‌ శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఎమ్యెల్యే అత్తార్‌ చాంద్‌బాషా నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కదిరిలో భవన, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారంతా గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన కార్మికులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తారని ఆయన చెప్పారు.

ఇళ్లు కట్టుకున్నాక అత్యవసరమైతే విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. ఇంటిపై ఉన్న రుణం కొన్నవారు కట్టుకోవాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు చంద్రన్న భీమా పథకంలో చేరితే వారింట్లోని ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరి వివాహానికి రూ.20 వేల చొప్పున పెళ్లికానుక, అలాగే ఒక్కొక్కరికి రెండు ప్రసవాలకు రూ.20 వేల చొప్పున ప్రసవ కానుక అందజేస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ గుడిసె దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు