నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం

12 Dec, 2015 11:51 IST|Sakshi

నిజామాబాద్‌: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకోవడం దాదాపుగా ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి జగదీష్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు