కులం పేరుతో దూషించారంటూ డీలర్‌పై ఫిర్యాదు

12 Dec, 2016 15:02 IST|Sakshi

శెట్టూరు : తమ గ్రామంలోని ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో డీలర్‌ కురబ రాజు తనను కులం పేరుతో దూషించి, చెయ్యి చేసుకున్నట్లు శెట్టూరు మండలం లింగదీర్లపల్లికి చెందిన ఎరుకుల ఇందిరమ్మ ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం స్టోర్‌కు వెళ్లగా కిందపడ్డ బియ్యాన్ని తీసుకెళ్లాల్సిందిగా డీలర్‌ ఆదేశించాడన్నారు. అందుకు తాను అభ్యంతరం తెలపడంతో మాటామాటా పెరిగిందన్నారు.

డీలర్‌ కులం పేరుతో దూషించగా, ఆయన భార్య త్రివేణి, అతని సోదరుడు మర్రిస్వామి తన చెంపపై కొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ భర్త నీలాంజితో కలసి డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనాథ్‌రెడ్డి సహా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌ వాణిశ్రీ దృష్టికి ఫోన్‌లో తీసుకెళ్లగా.. ఆర్‌ఐని గ్రామానికి పంపి విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు