నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహదం

12 Aug, 2016 23:46 IST|Sakshi
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహదం
  • డీఐజీ ప్రభాకర్‌రావు
  • పాలకుర్తి టౌన్‌ : నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వరంగల్‌ రేంజ్‌ డీఐజీ టి.ప్రభాకర్‌రావు అన్నా రు. శుక్రవారం పాలకుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. చౌరస్తాలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. వ్యాపార వర్గాలు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంఅభినందనీయమన్నారు. ప్ర«ధాన కూడళ్లలో సీసీ కెమెరాలు నిరంతరం నిఘా ఉండటంతో ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే పోలీసులకు తెలుస్తుందన్నారు.   డీఎస్పీ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ జనగామ సబ్‌ డివిజన్‌ పరిధిలో దేవరుప్పుల, కొడకండ్ల మండలాలతో పాటు జనగామ పట్టణంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. డివిజ న్‌లో అన్నిగ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పోలీసులు చురుగ్గా పాల్గొని మొక్కలు నాటుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ భూక్య దల్జీత్‌కౌర్, వైస్‌ ఎం పీపీ గూడ దామోదర్, సీఐ తిరుపతి, ఎస్‌ఐలు  నీలోజు వెంకటేశ్వర్లు,సత్యనారాయణ, రంజిత్, వ్యాపార వర్గాల ప్రతినిధి బోనగిరి కృష్ణమూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులుపసునూరి నవీన్, కమ్మగాని రమేశ్, తమ్మి రాంబాబు, బండి కిరణ్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు