దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

2 Nov, 2016 00:21 IST|Sakshi
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

 పాపన్నపేట: రైతుల ప్రయోజనం కోసమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట, రామతీర్థం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మల్లంపేటలో డీసీసీబీ డైరక్టర్ మోహన్‌రెడ్డి డీసీఓను సన్మానించారు.
 
  ఈ కార్యక్రమంలో రామతీర్థం సర్పంచ్ అనురాధ, పర్యవేక్షణ అధికారి సాదిక్ అలీ, బేతయ్య, కిష్టయ్య, నవీన్, అంథోని, సంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మెదక్‌రూరల్ (హవేళిఘనపూర్): హవేళిఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ సొసైటీ చైర్మన్ హన్మంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు రాజేశ్వర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
 
 టేక్మాల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కో-ఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రమైన టేక్మాల్ పీఏసీఎస్ గోదాం వద్ద  చైర్మన్ యశ్వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటు ఉంటామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని రైతులు లాభాలను గడించాలని ఆకాంక్షించారు.
 
  ఈ కార్యక్రమంలో జిల్లా డెరైక్టర్ మోహన్‌రెడ్డి, జెడ్పీటీపీ ఎంఏ.ముఖ్తార్, ఎంపీపీ అంజమ్మ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్ధయ్య, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, ఎంపీడీఓ విష్ణువర్దన్, సీఈఓ వేణుగోపాల్, పీఏసీఎస్ డెరైక్టర్లు విద్యాసాగర్, రవిశంకర్, గోవిందచారి, యాదయ్య, నాయకులు నిమ్మ రమేష్, వీరప్ప, కిషోర్, శ్రీనివాస్, నారాయణ, యాదగిరి, దేవేందర్, మోహన్ మల్లేశం, సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఈఓ వెంకట్‌రెడ్డిని, జిల్లా డెరైక్టర్ మోహన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.
 

మరిన్ని వార్తలు