పసికందును కాటేసిన అతిసార

18 Sep, 2016 23:38 IST|Sakshi

రాయదుర్గం రూరల్‌ : రాతిబావివంక గ్రామానికి చెందిన శెట్టినాయక్, సరితాబాయి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌నాయక్‌ (21 నెలలు) అతిసారతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సరితాబాయి పుట్టినిల్లు అయిన కర్ణాటకలోని ఖానహŸసళ్లి సమీపంలోని పూజారి హళ్లి తండాకు  గత ఆదివారం వెళ్లారు. మంగళవారం  వాంతులు, విరేచనాలు కావడంతో రాయదుర్గం పట్టణానికి  వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించిన అనంతరం బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో టుంకూరు వద్ద చనిపోయాడు. మృతదేహాన్ని శనివారం రాత్రి ఖననం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా సర్పంచ్‌ గాని, పంచాయతీ కార్యదర్శులు గాని, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గాని ఎటువంటి చర్యలూ చేపట్టలేదని గ్రామస్తులు తెలిపారు.

రాయదుర్గంలో డెంగీ కేసు..
రాయదుర్గం పట్టణం మొలకాల్మూరు రోడ్డు సున్నపుబట్టీల వద్ద హుస్సేన్‌బీ అనే పదేళ్ల చిన్నారి డెంగీ జ్వరం బారినపడింది. బళ్లారిలోని ఆర్‌కే ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించి, చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుందని తల్లిదండ్రులు ఖాసీంసాబ్, ఫాతిమాబీ తెలిపారు.

మరిన్ని వార్తలు