పౌరసరఫరాలు.. ఆరు ముక్కలు

4 Sep, 2016 00:10 IST|Sakshi
పౌరసరఫరాలు.. ఆరు ముక్కలు
  • ఉన్న వనరులు ఆరు జిల్లాలకు పంపకం 
  • మొత్తం ఫైళ్లు 2276
  • రేషన్‌షాపులు 2114
  • పంపిణీ ప్రతిపాదనలు సిద్ధం
  • హన్మకొండ అర్బన్‌ : 
     
    కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలతో పౌరసరఫరాల శాఖ పరిధిని ఆరు జిల్లాలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విభజన నేపథ్యంలో మిగతా శాఖలతో పోల్చితే పౌరసరఫరాల శాఖది కొంత విచిత్రమైన పరిస్థితి ఉంది. మిగతా శాఖల వారు మూడు జిల్లాల ప్రాతిపదికన వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలకు సిబ్బంది, సామగ్రి, రికార్డులు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. కానీ పౌరసరఫరాల శాఖ మాత్రం తమ పరిధిని ఆరు జిల్లాలకు పంపిణీ చేసే పనిలో ఉంది. ముఖ్యంగా ఈ శాఖ పరిధిలో రేషన్‌ షాపులు, గ్యాస్‌ సరఫరా ఏజెన్సీలు, కిరోసిన్‌ డీలర్లు, పెట్రోల్‌ పంపులు, రైస్‌మిల్లులు వంటివి ఉన్నాయి. ఇందుకు సంబందించి లెక్కలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇక శాఖకు సంబంధించి వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి, సిద్ధిపేట జిల్లాలకు పరిధిని బదలాయించాల్సి ఉంది. వరంగల్‌ ప్రసుత్త జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం మండలాలు యాదాద్రి జిల్లాలో, చేర్యాల, మద్దూరు మండలాలు సిద్ధిపేట జిల్లాలో కలుపుతూ ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో ఆయా మండాల పరిధిలో ఉన్నవాటిని అధికారులు ఆ జిల్లాలకు కేటాయించాలి.
     
    మొత్త ఫైళ్లు 2276
    పౌరసరఫరాల శాఖలో వివిధ విభాగాలకు సంబందించి మొత్తం 2276 ఫైళ్లు ఉన్నాయి. వీటిని స్కానింగ్‌ చేసి మండల, జిల్లా స్థాయి వాటిని ఆయా విభాగాలకు కేటయించే పనులు పూర్తి చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం మొత్తం జిల్లాలో 2114 రేషన్‌షాపులు, 9,60,599 రేషన్‌కార్డులు ఉండగా వాటిని మండలాల పరిధిని బట్టి ఆ జిల్లాలకు కేటాయించారు.  
    ప్రస్తుత వరంగల్‌ జిల్లాలో
     
    రేషన్‌షాపులు–2,114
    రేషన్‌కార్డులు–9,60,599
    యూనిట్లు–29,18,967
    రైస్‌మిల్లులు –191
    గ్యాస్‌ ఏజెన్సీలు– 58
    పెట్రోల్‌ పంపులు–206
    కిరోసిన్‌డీలర్లు–14
     
    ప్రతిపాదిత జిల్లాలకు కేటాయింపులు ఇలా..
     
    వరంగల్‌ .... 
    • రేషన్‌షాపులు– 627
    • రేషన్‌కార్డులు–3,10,815
    • యూనిట్లు–9,33,982
    • రైస్‌మిల్లులు – 99
    • గ్యాస్‌ ఏజెన్సీలు– 20
    • పెట్రోల్‌ పంపులు–65
    • కిరోసిన్‌ డీలర్లు–7
    హన్మకొండ జిల్లా
    • రేషన్‌షాపులు–421
    • రేషన్‌కార్డులు–2,13,812
    • యూనిట్లు–65,9115
    • రైస్‌మిల్లులు –38
    • గ్యాస్‌ ఏజెన్సీలు– 14
    • పెట్రోల్‌ పంపులు–66
    • కిరోసిన్‌ డీలర్లు–2
     
    భూపాలపల్లి జిల్లా..
    • రేషన్‌షాపులు–370
    • రేషన్‌కార్డులు–1,48,583
    • యూనిట్లు–42,7954
    • రైస్‌మిల్లులు –7
    • గ్యాస్‌ ఏజెన్సీలు– 9
    • పెట్రోల్‌ పంపులు–26
    • కిరోసిన్‌ డీలర్లు–లేరు
     
    మహబూబాబాద్‌ జిల్లా
    • రేషన్‌షాపులు–492
    • రేషన్‌ కార్డులు–1,99,249
    • యూనిట్లు–60,8128
    • రైస్‌మిల్లులు –25
    • గ్యాస్‌ ఏజెన్సీలు– 9
    • పెట్రోల్‌ పంపులు–31
    • కిరోసిన్‌డీలర్లు–1
     
    సిద్ధిపేట జిల్లా
    • రేషన్‌షాపులు–69
    • రేషన్‌కార్డులు–30,049
    • యూనిట్లు–98,473
    • రైస్‌మిల్లులు –11
    • గ్యాస్‌ ఏజెన్సీలు–2
    • పెట్రోల్‌ పంపులు–4
    • కిరోసిన్‌డీలర్లు–లేరు
     
    యాదాద్రి జిల్లా
    • రేషన్‌షాపులు–135
    • రేషన్‌కార్డులు–5,8091
    • యూనిట్లు–1,91,315
    • రైస్‌మిల్లులు –11
    • గ్యాస్‌ ఏజెన్సీలు–4
    • పెట్రోల్‌ పంపులు–14
    • కిరోసిన్‌ డీలర్లు–4 
మరిన్ని వార్తలు