జిల్లా ప్రారంభానికి సీఎంను ఆహ్వానిస్తాం

7 Sep, 2016 00:06 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకట్రావు

 

  • కలెక్టరేట్, ఎస్పీ, డీఆర్‌డీఏ కార్యాలయాలకు భవనాలు ఎంపిక
  •  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు

కొత్తగూడెం అర్బన్‌: కొత్తగూడెం జిల్లా ప్రారంభ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. మంగళవారం స్థానిక లక్ష్మీదేవిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తొలి,మలి ఉద్యమ పోరాటాలు ఇక్కడ నుంచే మొదలైన ఘనత ఉందన్నారు. జిల్లా పేరు కొత్తగూడెంగానే ఉంటుందని, మార్పులు ఉండవన్నారు. కొత్తగూడెంను జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు స్థానిక ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. ఇక కొత్తగూడెం జిల్లాలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న ఈఆర్‌పీ భవనము కలెక్టరేట్‌కు, సింగరేణి పాత డిస్పెన్సరీ భనవనాన్ని ఎస్పీ కార్యాలయానికి, పాత మున్సిపల్‌ కార్యాలయం భవనం డీఆర్‌డీఏ, డ్వామా కార్యాలయాల నిర్వహణకు ఎంపిక చేసినట్లు వివరించారు. దీంతో పాటు జిల్లాకు అదనంగా 44 ప్రభుత్వ శాఖలు రానున్నయన్నారు.జిల్లాలో మరిన్ని ప్లాంట్లతో పాటు వనరులు బొగ్గు, విద్యుత్, సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రానున్నాయన్నారు. జిల్లాలో పని చేసే అధికారుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు