పోర్టులో బొగ్గు దిగుమతి

15 Oct, 2016 01:36 IST|Sakshi
పోర్టులో బొగ్గు దిగుమతి
 
ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టు ద్వారా మండలంలోని థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు అవసరమైన బొగ్గు పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా యూకేకి చెందిన ఎంవీ అలికీ పెర్రోటిస్‌ అనే నౌక ద్వారా 59,310 టన్నుల బొగ్గు దిగుమతి జరుగుతోంది. పనామాకు చెందిన జియోలాండ్‌ అల్మైర్‌ నౌక నుంచి 56 వేల టన్నుల బొగ్గు దిగుమతి చేస్తున్నారు. 74,121 టన్నుల బొగ్గు దిగుమతి జరిపేందుకు హాంగ్‌కాంగ్‌కు చెందిన డెక్కన్‌ ప్రైడ్‌ నౌక శుక్రవారం లంగరు వేయనుంది. మరో భారీ నౌక కేప్‌ బ్రాజిల్లా ద్వారా 1.64 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేయనున్నారు. ఈ నౌక శనివారం పోర్టులో లంగరు వేయనుంది. 
 
 
మరిన్ని వార్తలు