పోలీసుల నిర్లక్ష్యంపై సీపీకి ఫిర్యాదు

11 Aug, 2016 00:18 IST|Sakshi
 
  • తన సామగ్రి తరలిస్తుంటే సీఐ పట్టించుకోలేదని ఆరోపణ 
  • న్యాయం చేయాలని బాధితుడి మొర
వరంగల్‌ : బ్యాంకు రుణం తీర్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన సామగ్రితోపాటు అనుమతి లేని విలువైన సామగ్రిని బిడ్డర్‌ పట్టుకెళ్లారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం ప్రదర్శించారని బాధితుడు మామిడాల శ్రీధర్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని దుర్గభవానీ అగ్రోటెక్‌ ఇండస్ట్రీస్‌లో మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉన్న మామిడాల శ్రీధర్‌ హన్మకొండలోని కెనరా బ్యాంకు నుంచి రుణం పొందాడు. రుణం తీర్చకపోవడంతో ఫ్యాక్టరీని బ్యాంకు అధికారులు కోర్టు అనుమతితో సీజ్‌ చేసి వారు రుణం ఇచ్చిన సామగ్రిని అమ్ముకునేందుకు అనుమతి పొందారు. కోర్టు అనుమతి పొందిన సామగ్రిని వరంగల్‌కు చెందిన ఇంతియాజ్‌ వేలంలో దక్కించుకున్నాడు. ఈ ఫ్యాక్టరీలో వేలం నిర్వహించని విలువైన సామగ్రి కూడా ఉంది. కానీ బిడ్డర్‌ జూలై 20న ఆ సామగ్రిని కొంత తీసుకెళ్లాడు.  దీంతో బాధితుడు అక్రమ తరలింపుపై ఆత్మకూరు సీఐకి ఫిర్యాదు చేసి తన సామగ్రికి రక్షణ కల్పించాలని కోరాడు. ఈ నెల 5న మళ్లీ బిడ్డర్‌ తనఖాలో లేని సామగ్రిని తరలిస్తుండగా బాధితుడు పోలీస్‌స్టేçÙన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో సీఐ లేనందున తాము చర్య తీసుకోలేమని ఎస్సై రామకృష్ణ చెప్పినట్లు బాధితుడు వెల్లడించాడు. దీంతో 100కు డయిల్‌ చేసి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. సామగ్రి తీసుకెళుతున్న లారీని అడ్డుకుంటే తన్నులు తప్పవని హెచ్చరించడంతో అడ్డుతొలగినట్లు చెప్పాడు. జరిగిన అన్యాయంపై సీఐని కలవగా ‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, 100కు కాల్‌ చేసుకో, సీపీ, డీఐజీ, డీజీపీకి కాల్‌ చేసుకో ఎవరైనా నాకే చెబుతారు. ఇది సివిల్‌ మ్యాటర్, కోర్టులో ఉందని చెబుతా’ అంటూ నానా దుర్భాషలాడి బ్యాంకు వారితో 420 కేసు పెట్టిస్తానంటు సీఐ బెదిరించారని ∙సీపీకి ఫిర్యాదు చేశారు.సీఐ నిర్లక్ష్యం వల్ల రూ.కోటికి పైగా సామగ్రి నష్టపోయానని ఈ అక్రమ విక్రయాలకు పాల్పడిన, మద్దతు పలికినవారిపై చట్టరీత్యా చర్య తీసుకొని న్యాయం చేయాలని సీపీని కోరాడు.  
>
మరిన్ని వార్తలు