వంట..నోరూరెనంట

28 Oct, 2016 23:58 IST|Sakshi
వంట..నోరూరెనంట

విజయవాడ (మొగల్రాజపురం) : మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార రుచులను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పర్యాటక శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఆర్‌పీ కుజారియా అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాయత్రీనగర్‌లోని మెట్రోపాలిటన్‌ హోటల్‌లో వంటల పోటీలు జరిగాయి. విజేతలకు కుజారియా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, మన ఆహారానికి మంచి పేరు ఉందన్నారు. దీనిద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో అపారంగా ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. టూరిజం శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.సుధాకుమార్‌‡మాట్లాడుతూ వంటల పోటీలను తమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించామన్నారు. పోటీలను నిర్వహించిన వెస్టిన్‌ కాలేజ్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ కె.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల విద్యార్థులతో పాటు స్టార్స్‌ హోటల్స్‌ చెఫ్‌లు, గృహిణులు పాల్గొన్నారన్నారు.

 

మరిన్ని వార్తలు