అన్ని ఫైళ్ల జిరాక్స్‌ అవసరం లేదు...

12 Sep, 2016 00:27 IST|Sakshi
హన్మకొండ అర్బన్‌ : జిల్లాల విభజన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని రకాల ఫైళ్లు జిరాక్స్‌ తీయాల్సిన అవసరం లేదని.. ముఖ్యమైన ఒకటి, రెండు రకాల ఫైళ్లు మాత్రం చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో దశాబ్దాల కాలం నాటి ఫైళ్లతో కుస్తీ పడుతు న్న ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి శాఖలోని మొత్త ఫైళ్లు నాలుగు సెట్లు జిరాక్స్‌ తీసి కొత్తగా ఏర్పాడ బోయే జిల్లాలకు పంపించాలని గతంలో ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల ఫైళ్లు వద్దు, ము ఖ్యమైన ఫైళ్లు మాత్రమే అనడంతో దాదాపు 80శాతం పనిభారం తగ్గినట్లు అధికారులు చెపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కోర్టు కేసులకు సంబంధించినవి, స్టాక్‌ వివరాలకు సంబంధించి మొ త్తం రెండు కేగిరీల ఫైళ్లు మాత్రమే జిరాక్స్‌ తీయడంతో పాటు స్కాన్‌ చేయాలి. వీటితో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ‘ముఖ్యమైనవి’ అనుకున్న ఫైళ్లు కూడా ఈ జాబితాలో చేర్చా రు. అలాగే, జిరాక్స్‌ తీసిన, తీయని మొత్తం ఫైళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇక జిరాక్స్‌ తీసిన ఫైళ్లు సంబంధిత కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు పంపించి. మిగతా వాటిని ప్రస్తుత జిల్లా కేం ద్రంలోనే భద్రపరచాలి. భవిష్యత్‌లో అవసరముంటే కొత్త జిల్లాల వారు ఇక్కడకు వచ్చి ఆ ఫైళ్లు తీసుకువెళ్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కార్యాలయాల్లో ఫైళ్లే దర్శనమివ్వకుండా, పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు సమాచారం. 
మరిన్ని వార్తలు