‘భూనిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలి’

15 Sep, 2016 00:04 IST|Sakshi

నంబులపూలకుంట : మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌హబ్‌లో భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని నాగులకట్ట వద్ద బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్‌లో ఉండే చిన్నపాటి ఉద్యోగాలను సైతం ఇతర ప్రాంతాల వారికి ఇస్తే ఇక్కడ ఉన్న యువకులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే రైతులతో కలిసి పోరాటం చేయడానికైనా తాము సిద్ధమన్నారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ టి.జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కదిరి డివిజన్‌ కార్యదర్శి వేమయ్య యాదవ్, మండల కార్యదర్శి అమీర్‌బాషా, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.  

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు