Sakshi News home page

సాగుకు పగలు మాత్రమే విద్యుత్‌! 

Published Thu, Sep 7 2023 2:35 AM

Agricultural power supply is limited to daytime hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని.. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటివేళల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంటే సౌర, పవన విద్యుత్‌తో తీర్చవచ్చ ని వివరించింది.

ఈ నెల 1న దేశంలో పగటిపూట విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు (ఒక గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్లకు సమానం) పెరిగిపోయినా తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్‌ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్‌ డిమాండ్‌ ఉంటోందని.. ఈ నెల 1న ఆ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్‌ నమోదైందని వెల్లడించింది.

సౌర విద్యుత్‌ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని.. అందువల్ల వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను పగటివేళలకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర విద్యుత్‌ శాఖ ఈ నెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ లేఖలోని వివరాల మేరకు.. 

23 శాతం పెరిగిన డిమాండ్‌ 
దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్‌ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఆ నెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్‌ యూ నిట్లకుపైగా విద్యుత్‌ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్‌ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్‌తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మి.యూనిట్ల కొరత ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్‌ లభ్యత పెరిగింది. 

దక్షిణాదిలోనే కొరత అధికం 
దేశవ్యాప్తంగా చూస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జలవిద్యుదుత్పత్తి జరగగా.. ఈసారి 40 గిగావాట్లలోపే ఉండటం గమనార్హం. జూన్‌–సెపె్టంబర్‌ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్‌ కేంద్రాలు ఉండగా.. 2–3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలుండగా.. గ్యాస్‌ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. 

విద్యుత్‌ డిమాండ్‌ తీర్చడానికి కేంద్రం సూచించిన చర్యలివీ.. 
 విద్యుత్‌ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలి. 
♦  షెడ్యూల్‌ ప్రకారం విద్యుత్‌ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్‌ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలి. 
ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్‌ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టు కోవాలి. ళీ నాణ్యత లేని బొగ్గు, యాష్‌ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక.. 12–14 గిగావాట్ల విద్యుత్‌ లభ్యత లేకుండా పోయింది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలి. 
♦ ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్‌కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకో వాలి. ళీ     విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్‌ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్‌ను పవర్‌ ఎక్స్చేంజి ల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలి. 
♦ డిమాండ్‌ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. 
♦ నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలి. 

Advertisement

What’s your opinion

Advertisement