నేటి నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభం

16 Mar, 2017 23:01 IST|Sakshi

– రెగ్యులర్‌ డిగ్రీ పరీక్షల్లో తొలిసారిగా ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం
– 27వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫైనలియర్‌ (రెగ్యులర్‌), మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి (సప్లిమెంటరీ ) పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం పంపించే విధానం దూరవిద్య పరీక్షల్లో సఫలమైంది. దీంతో రెగ్యులర్‌ డిగ్రీ పరీక్షల్లోను ఇదేవిధానాన్ని అమలు చేస్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్‌ పాస్‌ వర్డ్‌ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రశ్నాపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్షకు నిర్దేశించిన సమయం కంటే గంట ముందు పాస్‌వర్డ్‌ను మెయిల్‌ ద్వారా, ప్రిన్సిపాళ్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపుతారు. వీటి ద్వారా ప్రశ్నాపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 27 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.  ఫైనలియర్‌లో 15 వేల మంది హాజరుకానున్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ఆచార్య రెడ్డి వెంకటరాజు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాలు పంపే నూతన విధానంపై డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు