విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ

21 Oct, 2016 22:59 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు  సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా సైన్స్‌ సెంటర్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌–2016పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి బాలల సైన్స్‌–2016లో ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. ఎన్‌సీఎస్సీ కో–ఆర్డినేటర్‌ కె.ఆనందభాస్కర్‌రెడ్డి, సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌  సి.వెంకటరంగయ్య పాల్గొన్నారు. రీసోర్స్‌పర్సన్లుగా శామ్యూల్‌ ప్రతాప్, నారాయణ, నాగరాజు వ్యవహరించారు.

మరిన్ని వార్తలు