15న డిజిటల్‌ తరగతుల ప్రారంభం

7 Oct, 2016 01:04 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జిల్లాలో ఈ నెల 15న కనీసం 20 ప్ర భుత్వ పాఠశాలల్లో డిజిటల్‌  తరగతులు  ప్రారంభించాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవా లని డీఈఓ అంజయ్య, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ అధికారి దశరథరామయ్య ఎంఈఓలకు సూచించారు. స్థానిక సైన్స్‌సెంటర్‌లో గురువారం  ఎంఈఓలతో  సమావేశం నిర్వహిం చారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 15న డిజి టల్‌ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అధికారి కంగా ప్రారంభిస్తారన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 20 పాఠశాలల్లో తరగతులను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.

6–10 తరగతులకు సంబంధించి సమ్మేటివ్‌–1 పరీక్షలకు సంబంధించి ఈ నెల 14 నుంచి 18 వరకు మండల స్థా యిలో 5 శాతం  జవాబుపత్రాలను పునర్‌మూల్యాంకనం చే యాల్సి ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌ఏ పీఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆధార్‌సీడింగ్‌ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎమ్మార్సీ ఉద్యోగులు  క్లెయిమ్‌లు సకాలంలో పంపితే  జీతాలు  ఆలస్యం కా కుండా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు.   ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, సెక్టోరియల్‌  ఆఫీసర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు