కరువు నివారణకే హరితహారం

29 Jul, 2016 00:54 IST|Sakshi
కరువు నివారణకే హరితహారం
  • డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • కోల్‌బెల్ట్‌ : రాష్ట్రంలో కరువు శాశ్వత నివారణ కోసం కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం హాజరై మెుక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయనిన్నారు. దీనికి గత పాలకులు పర్యావరణ పరిరక్షణపై పట్టించుకోకపోవడమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో 230 కోట్లు మెుక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టగా ఈ ఏడాది 46 కోట్ల మెుక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు విస్త­ృతంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ గనులు, ఓపెన్‌కాస్టులు, కార్మికకాలనీలు, స్వాధీన భూముల్లో మొక్కలు నాటడంతోపాటు సంరక్షించుకోవాలన్నారు. సింగరేణి ఇప్పటికే 75 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. స్పీకర్‌ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ హరితహారంపై ప్రతిజ్ఞ చేయించారు. సింగరేణి డైరెక్టర్‌ ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్టు మనోహర్‌రావు, భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్య, జడ్పీ చైర్మన్‌ గద్దల పద్మ, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ, స్పెషల్‌ ఆఫీసర్‌ చక్రధర్, భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణ రవి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, ఎస్‌ఓటూ జీఎం సయ్యద్‌ హబీబ్‌హుస్సేన్, పర్సనల్‌ మేనేజర్‌ రేవు సీతారాం, వైస్‌ చైర్మన్‌ గణపతి, కౌన్సిలర్‌లు సిరుప అనిల్, కంకటి రాజవీరు, గోనె భాస్కర్, టీఆర్‌ఎస్‌ నాయకులు మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్, కొక్కుల తిరుపతి, కటకం స్వామి, జోగుల సమ్మయ్య, బిబిచారి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు